శ్రీ దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు

April 07, 2016 | 05:50 PM | 5 Views
ప్రింట్ కామెంట్
durmukhi-nama-ugadhi-subakankshalu-niharonline

మనజాతి పుట్టినరోజు, మన భాషకు గుర్తింపు వచ్చినరోజు, తొలి తెలుగు సామ్రాజ్య స్థాపన జరిగిన రోజు, తెలుగువారి వీర విక్రమ పరాక్రమ పౌరుషజ్వాలలు మిన్నంటిన రోజు, వసంతఋతుశోభతో తొలి సృష్టి ప్రారంభమైన రోజు, ఆరోగ్య సౌభగ్యమహాభాగ్యాలందించే ఓషధులకు జీవభావ ప్రభావాలు పల్లవించినరోజు, అదే తెలుగువారి నూతన సంవత్సర పర్వదినమైన ఉగాదిగా రూపుదాల్చింది. ఉగాది అసలు పేరు 'యుగాది' అంటే్ నక్షత్రగమనమార్పు మొదలైనరోజు, అలాగే యుగమునకు ఆది అని అర్ధం. యుగం అంటే సంవత్సరం  అని కూడా అర్ధముంది. అనగా కొత్త సంవత్సరానికి మొదలు అని కూడా అర్ధం. అందుకే ఈ పండుగను 'సంవత్సరాది ' అని  కూడా అంటారు

                           ఈ పండుగ ప్రతీ ఏడాది చైత్రమాసంలో శుద్ధ పాద్యమినాడు ప్రారంభమౌతుంది.ఆరోజే వసంత నవరాత్రులు కూడా ప్రారంభమౌతాయ్. విక్రమార్కుని పై శాతవాహనుడు సాధించిన ఘనవిజయానికి గుర్తుగా, తొలి తెలుగు సామ్రాజ్య ఆవిష్కరణకు నాందిగా  వసంత నవరాత్రులు జరుపుకోవడం తరతరాలుగా తెలుగువారి సంప్రదాయం . ఋతువులకు రాజైన వసంతఋతువులో వేప, మామిడి మొదలైన జీవవృక్షాలన్నీ చిగురించి పూలుపూసి మధురమకరందాలతో మహాశోభాయమానంగా విరాజిల్లుతుంది. వేప,మామిడి చెట్లకు ఈకాలంలో పూసే పూవుల్లో అనంతమైన జీవశక్తి దాగివుంటుంది. అందుకే ఆ జీవశక్తిని ఉగాదిపచ్చడి రూపంలో పండుగనాడు తినటం ద్వారా అ సమ్వత్సరమంతా దాని ప్రభావంతో వాత పిత్త కఫ సంబంధమైన ఏ వ్యాధి రాకుండా కాపాడగల ఆరోగ్యసంప్రదాయం కూడా ఈ పండుగలో దాగి వుంది.

నీహార్ ఆన్ లైన్ తరపున తెలుగువారికి దుర్ముఖి నామ సంవత్సర శుభాకాంక్షలు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ