అద్దెంటికి ఆంధ్రప్రదేశ్ సీఎం...!

December 26, 2014 | 11:04 AM | 19 Views
ప్రింట్ కామెంట్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం అద్దె ఇంటికి మారే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం తన కుటుంబం నివసిస్తున్న ఇంటిని కూల్చి, ఓ భారీ భవంతిని కట్టించుకోవాలని ఆయన భావిస్తున్నారు. కొత్త భవంతి పూర్తయ్యేంత వరకు సుమారు రెండేళ్లపాటు కుటుంబంతోపాటు కలిసి ఉండేందుకు ఆయన ఓ అద్దె ఇంటి కోసం అన్వేషిస్తున్నట్లు సమాచారం. అయితే జూబ్లీహిల్స్ రోడ్ నం.24 లో ఉన్న భవనం బాబు కొత్త నివాసంగా దాదాపు ఖరారైనట్లు తెలిసింది. ఈ ఇంటిని చంద్రబాబుతోపాటు ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పరిశీలించి వాస్తు ప్రకారం అవసరమైన మార్పుచేర్పులు సూచించారని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ