సేంద్రియ పద్ధతులపై రైతులతో పవన్ సభ

February 03, 2015 | 04:40 PM | 230 Views
ప్రింట్ కామెంట్

పవన్ కళ్యాన్ ఇష్టమైన వ్యాపకాల్లో వ్యవసాయ సేద్యం ముఖ్యమైనదిగా చెప్పుకున్నాం ఇంతకుముందే. దీనికి నిదర్శనమే ఆయన ఫామ్ హౌజ్ లో రకరకాల మొక్కల్ని పెంచుకోవడమే. ఈ హీరో రియల్ లైఫ్ లో పలుగు, పార పట్టుకుని కూరగాయల్ని, పండ్లను స్వయంగా పండించుకుంటారంటే నమ్మశక్యం కాదు ఎవరికైనా. ఆ మధ్య సేంద్రీయ ఎరువులని ఉపయోగించి పంటలు పండించాలనే ఉద్యమంలో తానూ చేయి కలిపాడు కూడా. ఇప్పుడు అదే స్ఫూర్తితో అందరికీ దర్శనమివ్వబోతున్నాడట. ఇది రీల్ మీద మాత్రం కాదండోయ్. రియల్ లైఫ్ లోనే. వ్యవసాయం చేయడానికి పురుగుమందులు వాడి ప్రాణాలు తీసుకున్న రైతుల కోసం ఈ ఉద్యమానికి పూనుకుంటున్నాడట. కర్నూలులో ఒక భారీ సభను ఏర్పాటు చేస్తున్నారట. ఈ సభలో ఆయన రైతులకు సేంద్రియ ఎరువులు వాడి ఎలా పంటలు పండించాలో వివరిస్తారట. పంటల వల్ల ఎలా లాభాలు పొందాలి అనే విషయాల్ని వారికి చెప్పబోతున్నారు. ఆయన ఫాం హౌజ్ లో ఈ పద్ధతిలోనే పంటలు పండిస్తున్నానని వివరిస్తారట. ఈ కార్యక్రమాన్ని ఓ మిత్రుడి సాయంతో నిర్వహిస్తున్నారాయన. సినిమాలకు, రాజకీయాలకూ దూరంగా సమాజానికీ, ముఖ్యంగా రైతులకు సహాయం అందించే ఉద్దేశంతోనే ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ అన్న దాతకు ఉపయోగ పడే ఈ కార్యక్రమానికి పూనుకోవడం నిజంగా అభినందించ దగిన విషయం. రైతులకు ఆసరాగా పవన్ చేపట్టిన ఈ చైతన్య కార్యక్రమం ఫలవంతం కావాలని మనమంతా కోరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ