ఖైదీల యందు పరిశుద్ధ ఖైదీలు వేరయా!

July 22, 2015 | 04:56 PM | 2 Views
ప్రింట్ కామెంట్
rajahmundry_central_prisoners_godavari_pushkar_niharonline

పుష్కర వైభోగం కొండెక్కే ముహుర్తం దగ్గర పడుతుంటే పుష్కరిణిలో మునిగి పాపాలు కడిగేసుకోవాలని పుణ్యాత్ములతోబాటు పాపాత్ములు కూడా తహతహాలాడటం సహజం. దీనిలో ముందు వరుసలో రాజకీయ పాపాత్ములు మొదలుకొని ఖైదీ పాపాత్ముల వరకూ ఉండొచ్చు. మరి ఖైదీ బాబాయిలకు స్వేచ్ఛ ఉండదు కదా! ఈ పుణ్యకాల సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు గోడలు అడ్డుగా నిలవడం వల్ల అధికారులను స్నానమాచరించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడుతున్నారు. మాలో పరివర్తన సంభవించింది, ఆధ్యాత్మిక చింతనతో మనుగడ సాగిస్తున్న తమకు పుష్కరస్నానం చేసే అవకాశం కల్పించండి ప్రభో అని వేడుకుంటున్నారు. ఈ బుద్ధిమంతులందరూ జీవిత ఖైదీలు, మారు మనసు చెంది ఉండవచ్చు... కానీ, ఈ గడుగ్గాయిలకి ఈత వచ్చి ఉంటే? ఈత విద్యలో మరో చమత్కార విద్య ఉంది. మునుగ ఈత అని... స్నానం చేస్తూ రాజమండ్రిలో మునిగి వాళ్ల ఊర్లో తేలితే? జైలు అధికారుల ఉద్యోగాలు అదే గోదాట్లో కలిసిపోగలవు. ఖైదీ అంత కిరీటం లేకపోయినా, బెయిల్ పై ఉన్న సండ్ర వెంకట వీరయ్యగారికి కొన్ని ఆంక్షలు ఉన్నందున వారు కూడా ఈ ఖైదీలకు మెరిసిన ఆలోచన వచ్చి అర్జీపెట్టుకున్నారట! ఇది చంద్రబాబుకి తెలిస్తే, ఏమీ అక్కర్లేద, రెండు చెంబుల్తో గోదావరి నీళ్లు జైలుకి పంపించి, నెత్తిమీద చిలకరించండి... ఆ విధంగా ముందుకు పోండి అనగలడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ