ఏపీ నూతన రాజధాని విజయవాడకు మహర్దశ ప్రారంభం కానుంది. అక్కడ అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటుకు ఆ దేశ రాజకీయ, మిలటరీ వ్యవహారాల కార్యదర్శి పునీత్ తల్వార్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పునీత్ తల్వార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆయనకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పునీత్ భారత్ లో పర్యటిస్తారు. భారత్ పర్యటనలో భాగంగా పునీత్ భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, రక్షణ మంత్రులతో కానున్నారు. ప్రాంతీయ, తీర రక్షణ భద్రత, వాణిజ్యంతోపాటు మరిన్ని అంశాలపై వ్యూహాత్మక సహకారంపై భారత్ ఉన్నతాధికారులతో పునీత్ చర్చలు జరపనున్నారు.