అలెర్ట్‌ అవుతున్న టిడిపీ నాయకత్వం

December 26, 2014 | 01:26 PM | 38 Views
ప్రింట్ కామెంట్

జనవరిలో బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వస్తున్నారు. 2019లో జరిగే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో సైతం పార్టీని పటిష్టపరిచేందుకే అమిత్‌షా పర్యటన ముఖ్య ఉద్దేశ్యం అని తెలుస్తున్నది. ఇక అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తుండటంతో తెలుగుదేశం పార్టీ అలెర్ట్‌ అయింది. కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలలో ఉన్న నేతలు ఇప్పటికే చాలామంది పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు. వారంతా అటు బీజేపి లోకి గాని, లేకపోతే ఇటు తెలుగుదేశం పార్టీలోకి గాని మారే వచ్చే అవకాశం ఉన్నది. అయితే, ఇతర పార్టీలలో ఉన్న ముఖ్య నేతల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించేందుకు టిడిపీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ముఖ్యనేతలను, చరిష్మా ఉన్న నేతలను కమలతీర్ధం పుచ్చుకోకుండా, తమవైపు తిప్పుకునేందుకు పసుపుదళం పధకాలను రూపొందిస్తున్నట్టు తెలుస్తున్నది. జాతీయ స్థాయిలో ఇప్పుడు కమలం విరబోస్తున్నది. సమస్యాత్మక రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్‌లో సైతం అనుకున్న స్థాయిలో కాకపోయినా, ప్రభుత్వం ఏర్పాటు చేసేవిషయంలో కీలక పాత్ర వహించే స్థాయికి ఎదిగిన విషయం మనకు తెలిసిందే. కమలం దేశవ్యాప్తంగా హల్‌చల్‌చేస్తుండటంతో ప్రాంతీయ పార్టీలు సైతం బెంబెలేత్తుతున్నాయి. మరి బీజేపికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అడ్డుకట్ట వేస్తుందా చూడాలి మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ