ఉగాది రోజున నంది అవార్డులు

January 20, 2015 | 05:35 PM | 49 Views
ప్రింట్ కామెంట్

ప్రతి సంవత్సరం తెలుగు నూతన సంవత్సరాది, ఉగాది పర్వదినాన నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సమాచార మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ రిలేషన్స్ ఎక్స్ అఫిషియో కార్యదర్శి, ఎన్వీ రమణ రెడ్డి ఈ విషయంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఎన్టీఆర్ జాతీయ అవార్డును మరియు సినిమా అవార్డులను కూడా ఉగాది రోజున అందజేస్తారు. సినిమా అవార్డులు మాత్రమే కాకుండా, అక్టోబర్ 15వ తేదిన టీవీ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి, థియేటర్ ఆర్ట్స్ లో ఎన్టీఆర్ పుట్టిన రోజు జ్ఞాపకంగా మే 28న నంది అవార్డులు అందజేయాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుండి జనవరి 16వ తేది వరకు సినిమాలకు సంబందించిన ఎంట్రీలను ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. 2012 మరియు 2013 సంవత్సరాలకు గాను, ఇంకా నంది అవార్డులను ప్రకటించలేదు. ప్రభుత్వం త్వరలో కమిటీలు ఏర్పాటు చేయనుంది. అనంతపూర్ లో టీవీ నంది అవార్డుల ప్రదానోత్సవ వేడుక, రాజమండ్రిలో థియేటర్ ఆర్ట్స్ నంది అవార్డుల ప్రదానోత్సవ వేడుక నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది ఉత్సవాలను ఎక్కడ నిర్వహిస్తే సినిమా అవార్డుల ప్రదానోత్సవ వేడుక అక్కడ ఉంటుందని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ