పంచ్: ప్రత్యేక హోదాపై వెంకయ్య సారూ తేల్చేశారు

January 24, 2015 | 06:05 PM | 58 Views
ప్రింట్ కామెంట్

ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తేల్చి చెప్పారు. ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన ప్రత్యేక హోదా గురించి ఆయన విజయవాడలో మాట్లాడారు. ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు.. అక్కడ అసలు విషయాన్ని కుండ బద్దలుకొట్టినట్లు చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేరుగా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, అన్ని రాష్ట్రాలు ఒప్పుకొంటేనే అది సాధ్యమని అన్నారు. గత ప్రభుత్వం చేసిన పని వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంతా అంటున్నారు గానీ, వాస్తవానికి ఇప్పుడు కేంద్ర పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదని ఆయన చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ