బాబుకు అల్లు అర్జున్ రూ.25లక్షల చెక్కు

December 09, 2014 | 04:03 PM | 94 Views
ప్రింట్ కామెంట్

హుదూద్‌ తుఫాన్‌ బాధితులకు స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పడు కొచ్చిన్‌ లో వున్న తనకి ఈ వార్త తెలిసి వెంటనే తనవంతు ఆర్దికసాయం అందించాలని 25 లక్షలు ప్రకటించారు. హుదూద్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్ర కకావికలమైందన్న వార్త తనను కలిచి వేసిందని కూడా అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా టీవీల్లో తుఫాన్‌ వార్తలు తెలుసుకున్న అర్జున్‌ అక్కడి వారు పడుతున్న బాధలతో తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలిపాడు. ఈ సంధర్బంగా నిన్న సాయంత్రం ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి తన ప్రకటించిన ఆర్ధిక సాయం 25 లక్షల చెక్‌ ని అందించారు.ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఇటీవల సంభవించిన హుదుద్‌ తుఫాన్‌ భీభత్సంతో వలన నాకెంతో ఇష్టమైన విశాఖపట్నం రూపు రేఖలు మారిపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా రైతులు, మధ్యతరగతివారు, మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోయారు. నేను ఇచ్చిన 25 లక్షల ఆర్థిక సాయంలో ఎక్కువ భాగం సముద్రాన్నే నమ్ముకుని జీవించే మత్స్యకారుల కోసం ఉపయోగించాలని ఏ.పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు గారిని కోరాను. తుఫాన్‌ ప్రభావంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. వారి వలలు, పడవలు ధ్వంసమవ్వడంతో జీవనోపాధి దెబ్బతినడం నన్ను కలచివేసింది. ఇలాంటి విపత్కర పరిణామాలు భవిష్యత్తులో మరొక్కసారి రాకుండా వుండాలని ఆ భగవంతున్ని ప్రార్దిస్తున్నానని అన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ