ఎవరనుకున్నారు? రాయలసీమ పరిరక్షక సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటం చేద్దామని ప్రయత్నించి అది విఫలం అవటంతో కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారే ఆయన. విభజన వ్యతిరేకతను ఎన్నికల్లో వాడేసుకోని సీమ సెంటిమెంట్ తో కొన్ని సీట్లు కొట్టేద్దామని టీడీపీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక పార్టీని నెలకొల్పారు. అయితే ప్రజలు ఆయనకసలు టైమే ఇవ్వలేదు లేండి. ఎంత స్పీడుగా వచ్చారో అంతే స్పీడుగా ఆయనను ప్రజలు తొక్కేశారు. దీంతో ఇప్పుడు ఇన్నీ రోజులు సైలెంట్ గా ఉన్న ఆయన ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ కావాలని కొరుకుంటున్నాడు. అంతేకాదు తిరిగి సోంత గూటికి చేరేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ బైరెడ్డికి కర్నూలులో రాజకీయంగా బాగా పలుకుబడి ఉంది. అంతేకాదు మొన్నటి ఎన్నికల్లో కర్నూల్ అసెంబ్లీ నియోజక వర్గాలలో ఆర్పీఎస్ పార్టీ నిల్చున్న అభ్యర్థులు గెలిచినవారికి గట్టి పోటీనే ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ బలంగా ఉన్న కర్నూలు జిల్లాలో గట్టి పోటీనివ్వాలంటే బైరెడ్డి ని తిరిగి పార్టీలో చేర్చుకోవాలని టీడీపీ నేతలంతా చంద్రబాబు కు సూచించారట. దీంతో బైరెడ్డి టీడీపీలో చేరటానికి ఎలాంటి అడ్డంకులు లేవనే చెప్పాలి. ఏదేమైనా ఫైనల్ డెసిషన్ మాత్రం చంద్రబాబుదే.