జాతీయ స్థాయిలో జల రవాణా మార్గాలను అభివ్రుద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు జాతీయ జల రవాణా మార్గం ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.2500 కోట్లు కేటాయించిందని వైజాగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ భేటీకి కేంద్రమంత్రలు వెంకయ్యనాయుడు, రాధా కృష్ణన్ హాజరవుతారని పేర్కొన్నారు. జాతీయ జల రవాణా ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆయన తెలిపారు. కాగా, కోల్ కతా నుంచి చెన్నై వరకు బ్రిటీష్ వారి హయాంలో బకింగ్ హాం కాలువ నిర్మించడం తెలిసిందే. ప్రస్తుతం అది చాలా దెబ్బతింది. పలుచోట్ల భారీగా పూడిక పేరుకుపోయింది. దీన్ని శుభ్రపరిచి రవాణాకు అనువుగా మలచాలని కేంద్రం భావిస్తోంది.