ఆర్టీసీ విభజనను వివాదాస్పదం చేయోద్దంటున్న గడ్కరీ

January 16, 2015 | 04:50 PM | 17 Views
ప్రింట్ కామెంట్

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ విభజన వివాదాస్పదం చేయవద్దని రెండు రాష్ట్రాలనూ కొరుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విభజనలో తలెత్తె సమస్యను కేంద్రం పరిష్కరిస్తుందని హామీనిచ్చారు. పనిలో పనిగా ఏపీపై అనేక వరాలు కురిపించారు. ఏపీ రాజధానిని కలిపే మార్గాలతో సహా మొత్తం 624 కి.మీ. రహదారులను జాతీయ రహదారులగా అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. రాయలసీమ నుంచి నూతన రాజధాని వరకూ ఉన్న మార్గాలను జాతీయ రహదారులుగా మారుస్తామన్నారు. జాతీయ రహదారుల కోసం చేపట్టే భూసేకరణపై చంద్రబాబు భరోసా ఇచ్చారని, వాటిల్లో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కరిస్తామని చెప్పారని వివరించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం కృషి చేస్తుందని పేర్కోన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ