మనిషిని కరిచి ‘కుక్క’ చావు చచ్చింది

April 22, 2016 | 11:41 AM | 7 Views
ప్రింట్ కామెంట్
dog-bites-man-died-in-kadapa-niharonline

కుక్క మనిషిని కరిస్తే వింతేముంటుంది. అదే మనిషి కుక్కును కరిస్తే వార్త అని అంటుంటారు. కానీ, ఖచ్చితంగా కాదుకానీ ఇంచుమించు అలాంటిదే కానీ ఓ మాంచి వార్త మాత్రం మనకు ఇక్కడ దొరికింది. ఇక్కడ కుక్క మనిషినే కరిచింది. కానీ, నురగలు కక్కుకుంటూ చచ్చిపోయింది. వింత కాదంటారా? కడప జిల్లా పుల్లంపేట మండలం అనంతంపల్లె పంచాయతీలోని చాపల దళితవాడలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన ఓ మానసిక వికలాంగుడు మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుండటంతో ఊరంతా అతడిపై పిచ్చోడిగా ముద్ర వేసింది. ఆ వ్యక్తి గురువారం ఓ వీధి గుండా వెళుతుండగా ఓ కుక్క తన పిల్లలను కాపాడుకునే క్రమంలో అతడిపైకి లంఘించింది. పళ్లతో కసితీరా కరిచింది. అయితే అతగాడు ఏం పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోగా, కాసేపటికే కుక్క నోట్లో నుంచి నురగలు రావడం, ఆపై గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సదరు వ్యక్తికి ఏదో భయంకరమైన వ్యాధి ఉందని అనుమానంతో భయంతో వణికిపోతున్నారంట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ