లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేసే పోలీసులు వ్యక్తిగత జీవితాల్లో ఎలా ఉన్నా ఫర్వాలేదు. కానీ, అది రోడ్డుకు చేరితేనే రచ్చ రచ్చ అవుతుంది. తాజాగా చిత్తూరు ఓ ఇద్దరు పోలీసులు చేసిన వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. మద్యం మదం తలకెక్కిన ఓ ఇద్దరు పోలీసులు కోడికూర తనుకున్నారు. పీలేరు పోలీస్ స్టేషన్లో పనిచేసే హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్ చలపతి మధ్య ఈ ఫైటింగ్ జరిగింది. ఈ గొడవలో ఇద్దరికీ గాయాలయ్యాయి. గొడవకు దిగి డిపార్టుమెంటు పరువును గంగలో కలిపిన వారద్దరూ అంతటితో ఆగకుండా వారు పనిచేసే స్టేషన్ లోనే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాతే గాయాలకు చికిత్స చేయించుకునేందుకు వారిద్దరు ఆస్పత్రిలో చేరటం విశేషం. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ విషయం మొత్తం తమ ద్రష్టికి వచ్చిందని, దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.