కుదిరితే రాజధానికి లేదంటే అనంతకు…

December 18, 2014 | 12:12 PM | 30 Views
ప్రింట్ కామెంట్

తెలుగు జాతి ఔనత్యానికి కృషి చేసిన నటుడు, మాజీ సీఎం స్వర్గీయ ఎన్.టీ.రామారావు పేరును ఆంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక జిల్లాకు పెట్టాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడా అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కుదిరితే కొత్త రాజధానికి, లేదంటే అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టాలని ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కోరుకుంటున్నారట. గతంలో అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్నారని గుర్తుచేస్తూ, ఇప్పుడు కొత్త రాజధానికి ఎన్టీఆర్ పేరు పెట్టినట్లయితే, అనంతపురం జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటామన్నారు. ఒకవేళ డీలిమిటేషన్ లో భాగంగా అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తే, హిందూపురం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరదామని బాలయ్య అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో చెప్పినట్టు తెలిసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ