ఆన్ లైన్ మోసం: ల్యాప్ టాప్ ప్లేస్ లో రాళ్లు, చపాతీ పీసులు

November 19, 2015 | 02:25 PM | 3 Views
ప్రింట్ కామెంట్
eluru-student-cheated-online-shopping-laptop-paytm-niharonline

ఆన్ లైన్ మోసాలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. ఇంటినుంచే షాపింగ్ చేస్తున్న వారిని నకిలీ కంపెనీలు దగా చేస్తున్నాయి. సులువైన మార్గంగా భావించి ఆన్ లైన్ లో కొనుగోలు చేసి మోసపోయామని భావించి ఆనక గుండెలు బాదుకుంటున్నారు. తాజాగా ల్యాప్ టాప్ ఆర్డర్ చేసి మోసాపోయాడు ఓ బీటెక్ విద్యార్థి. ల్యాపీ బదులుగా రాళ్లు, చపాతీ ముక్కలు రావడం చూసి కంగుతిన్న ఘటన జరిగింది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని పోణంగి రోడ్డులో ఉంటున్న కొలుసు తారకరామ్ అనే బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఈ నెల 12న ఓ ప్రముఖ ఆన్ లైన్ సైట్ ద్వారా లెనోవా కంపెనీ ల్యాప్ టాప్ ను బుక్ చేశాడు. ఇందుకు రూ.31,940లను అప్పటికప్పుడే ఆన్ లైన్ లో చెల్లించాడు. ఓ ఆరు రోజుల తరువాత (బుధవారం) కొరియర్ ద్వారా విద్యార్థి ఇంటికి పార్శిల్ వచ్చింది. ఆతృతతో తెరచి చూడగా రెండు రాళ్లు, కొన్ని చపాతీ ముక్కలు ఉన్నాయి.

                            ల్యాప్ టాప్ స్థానంలో ఊహించని వస్తువులుండటంతో యువకుడు నిర్ఘాంతపోయాడు. అయితే వెంటనే ఆ కంపెనీ టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసినా స్పందన లేదు. దాంతో అతడు విషయాన్నంతటినీ మీడియాకు వెల్లడించాడు. అంతేగాక తనకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తానని చెబుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ