ఏపీ భవిష్యత్ రాజధాని విజయవాడలో యూఎస్ కాన్సూలేట్ కార్యాలయం ఏర్పాటు చేస్తారన్న వార్త ఉత్తదేనంట. రెండు రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చిన యూఎస్ ప్రతినిధులతో చర్చించిన సీఎం చంద్రబాబుకు వారు హామీ ఇచ్చారని, ఈ మేరకు విజయవాడలో యూఎస్ కాన్సూలేట్ ఏర్పాటవుతుందని ముఖ్యమంత్రి కార్యలయం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అలాంటి ఆలోచనలేవి చేయట్లేదని అమెరికా ప్రతినిధుల కార్యాలయం నుంచి ఒక వార్త గురువారం వెలువడింది. ఏపీ కాదు కదా అసలు భారత్ లోనే కొత్తగా కాన్సూలేట్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో లేదని తెలిపింది. దీంతో ఏపీ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఇక నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు యూఎస్ ప్రతినిధులను బ్రతిమాలే పనిలో పడ్డారట.