డ్రైవర్ కునుకుతో 19 ప్రాణాలు కానరాని లోకాలకు...

September 14, 2015 | 11:44 AM | 3 Views
ప్రింట్ కామెంట్
east-godavari-lorry-accident-19-killed-niharonline.jpg

తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యంగా నిద్ర పోవటంతో 19 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జిల్లాలోని ఏలూరు బైపాస్ వద్ద 35 మంది కూలీలు అటుగా వస్తున్న ఓ బూడిద లారీ ఎక్కారు. తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి జాతీయ రహదారిపైకి రాగానే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి మృత్యువాత పడగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  వేగంగా వెళ్తున్న సమయంలో డ్రైవర్ నిద్రపోవటంతో పంట పొలాల్లోకి లారీ దూసుకెళ్లి బోల్తాపడింది. మొత్తం 35 మందిలో 16 మంది అక్కడిక్కడే చనిపోయారు. మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి మిగతా ముగ్గురు ఏమయ్యరన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. స్వల్ఫ గాయాలతో బయటపడి తమ స్వస్థలానికి వెళ్లిపోయారా లేక బురదలో చిక్కుకుని శవాలయ్యారా అన్నది తేలటం లేదు. ప్రస్తుతం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్లైయాష్ కింద వారంతా చిక్కుకుని ఉంటారని సహయక సిబ్బంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

అలా లారీ ఎక్కిన వారంతా తూర్పుగోదావరి జిల్లా కత్తిపాడు, తొండంగి, అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. 19 రోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం చింతలపూడి వెళ్లిన వారు తిరిగి ఏలూరు వరకు బస్సులో వచ్చారు. అక్కడ నుంచి రవాణా సౌకర్యం ఏం లేకపోవటంతో లారీని ఆశ్రయించారు. అదే వారి ప్రాణాలను బలి తీసుకుంటుందని  ఊహించలేకపోయారు.

ఇక ఈ ఘోర ప్రమాదానికి కారణమైన డ్రైవర్ జోగి శీను క్లీనర్ తో సహా వైజాగ్ లోని నక్కపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.  

తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి వద్ద జరిగిన లారీ ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్‌ సుబ్రమణ్యంతో విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. బాధిత కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించిన చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల నష్టపరిహారంతోపాటు ఇళ్లస్థలాలు ఇస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడంతోపాటు 25వేలరూపాయల చొప్పున ఆర్థికసాయం అందిస్తామన్నారు. లారీలో కూలీలను ఎక్కించినా పోలీసులు, రవాణశాఖాధికారులు పట్టించుకోకుండా ఉండటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ