మహానేత వర్థంతికి ఉల్లిగడ్డలు పంచారు

September 02, 2015 | 04:41 PM | 3 Views
ప్రింట్ కామెంట్
YSRCP-leaders-in-vijayawada-onions-distribution-on-YSR-death-anniversary-niharonline.jpg

సాధారణంగా ఎవరివైనా జయంతులు, వర్థంతులు అవుతున్నాయాంటే వారి అభిమానులు పండ్లు, బట్టలు పంచడం, వీరాభిమానులైతే రక్తదానం చేయడం ఇలాంటివి చేస్తుంటారు. కానీ, ఇక్కడ అందుకు వెరైటీగా ఓ పని చేశారు వైసీపీ నేతలు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా ఈరోజు పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే విజయవాడ వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా ఓ ఆలోచన చేశారు. ప్రస్తుతం ఉల్లి ధర కొండెక్కి జనాలతో కన్నీళ్లు పెట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ప్రజలకు అత్యంత అవసరమైన ఉల్లిపాయలు అందిస్తే బాగుంటుందని వారు అనుకున్నారు. విజయవాడ సీతారాపురం కొత్త వంతెన వద్ద స్థానిక నేతలు ప్రజలకు ఉల్లిపాయలు పంచారు. కష్టకాలంలో ఆదుకున్నట్లుగా ఉల్లి ధరలు మండిపోతున్న సమయంలో మహానేత పేరిట వాటిని పంచడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారట.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ