ఫ్లెక్సీ రేపిన చిచ్చు

December 06, 2014 | 05:20 PM | 38 Views
ప్రింట్ కామెంట్

కృష్ణా జిల్లా పోరంకిలో అధికార పార్టీ అయిన టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శుక్రవారం పోరంకిలో స్వచ్ఛభారత్‌ కార్యక్రమం చేట్టాలని భావించిన టీడీపి అక్కడ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే ఆ ఫ్లెక్సీలని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు తొలగించారనే విషయమై ఇరు పార్టీల మధ్య వివాదం చెలరేగింది. స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, మాజీ మంత్రి పార్థసారథిల మధ్య వివాదం తారాస్థాయికి చేరి ఘర్షణకు దారితీసింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు పార్థసారథిని అరెస్ట్‌ చేశారు. పెనమలూరు పీఎస్‌ ఎదుట ఘర్షణపూరిత వాతావరణ నెలకొంది. ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలకు దిగి వ్యతిరేక నినాదాలు చేసుకున్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి కార్యకర్తల్ని చెదరగొట్టారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ