తూర్పుగోదావరి జిల్లాలో ఆంజనేయుడి పాదముద్ర!!

July 29, 2015 | 11:30 AM | 10 Views
ప్రింట్ కామెంట్
gaint_footstep_lord_hanuma_found_in_eastgodavari_kothapalem_AP_niharonline

పరోపకారం గురించి పురాణాలు ఎంత చెప్పినా పట్టించుకోని ‘వెర్రి’ జనాలు ఏదైనా కొంచెం జరిగితే చాలు అతి చేసేస్తుంటారు. ఏది కనబడినా సరే అదంతా దేవుడి మహాత్యమే అంటూ పూజలకు ఎగబడిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.  కొత్తలంక గ్రామంలోని ఓ పొలంలో భారీ పాదం ఆకారం కనిపించింది. ఇంకేం, అది దేవుడిదే అంటూ పూజలు చేయడం ప్రారంభించారు. ఆ ఆకారానికి దండలు వేసి, బొట్టు పెట్టి మరీ కొబ్బరి కాయలు కొట్టేస్తున్నారు. ఈ విషయం దావానంలా వ్యాపించడంతో చుట్టుపక్కల ఊళ్లలోని జనాలు కూడా ఈ వండర్ ని చూసేందుకు ఎగబడిపోతున్నారు. ఒకావిడైతే ఏకంగా ఇది ఖచ్ఛితంగా అంజనేయుడి పాదమే. గ్రామానికి ఆయన కరుణ లభించింది అంటూ మొక్కుతుంది. మరీ ఆవిడగారు ఇంతకు ముందు ఎప్పుడైనా ఆంజనేయుడిని, ఆయన పాదం చూసి ఉండొచ్చేమో!!. ఇక ఈ విషయం తెలుకున్న జనవిజ్ణానవేదిక వాళ్లు రెక్కలు కట్టుకుని కొత్తలంకలో వాలిపోయారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ