ఏపీలో స్నేక్ గ్యాంగ్ స్టైల్లో అత్యాచారాలు

February 03, 2016 | 05:53 PM | 9 Views
ప్రింట్ కామెంట్
gang-rape-group-busted-and-arrested-in-vijayawada

హైదరాబాద్ స్నేక్ గ్యాంగ్ గుర్తుందా? ఏకాంతంగా ఉన్న జంటలపై కన్నేసి, పాములతో బెదిరించి, ఆపై అత్యాచారం వాటిని వీడియోలు తీసి బెదిరించి డబ్బు గుంజడం వారి పని, పదుల సంఖ్యలో జరిగిన ఈ దారుణాలను ఆలస్యంగా పసిగట్టారు ఇక్కడి పోలీసులు. సరిగ్గా ఇలాంటి ముఠానే ఇప్పుడు ఏపీలోనూ దర్శనమిచ్చింది. దోపిడీలకు, అత్యాచారాలకు పాల్పడిన నలుగురు సభ్యులతో ముఠాను పోలీసులు పట్టుకున్నారు. చూడడానికి విద్యార్థుల మాదిరిగానో, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ల మాదిరిగానే కనిపించే ఆ నలుగురు కత్తులతో బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారు, దాదాపు 20 అత్యాచారాలు చేశారు. చివరకు తాడేపల్లి పరిధిలో ఓ యువతిని అత్యాచారం చేసేందుకు యత్నించి దొరికిపోయారు. విచారణలో వెల్లడించిన వివరాలతో సీసీఎస్‌ పోలీసులు షాక్‌కు గురయ్యారు.

            విజయవాడ పరిధిలోని నున్న-పాయకరావుపేట మధ్య 200 ఎకరాల్లో వేసిన వెంచర్‌లో ఖాళీ ప్లాట్ల వద్దకు ప్రేమ జంటలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో జంటలు వెళ్తుంటాయి. ఇదే అదునుగా తాడేపల్లికి చెందిన నలుగురు యువకులు ముఠాగా ఏర్పడి తమ కార్యకలాపాలు కొనసాగించారు. 2014 డిసెంబర్‌ నుంచి గత మార్చి వరకు నాలుగు నెలల వ్యవధిలోనే పలు దొపిడీలు చేయటంతోపాటు, సుమారు 20 మంది మహిళలను అత్యాచారం చేశారు.

          పరువుపోతుందని బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదు. వీరిలో మహిళలతో పాటు విద్యార్థినులు కూడా ఉన్నారు. తాజాగా ఓ ఇంట్లో దొపిడీ చేసి అనంతరం యువతిని రేప్ చేసింది ఈ గ్యాంగ్. యువతి ఫిర్యాదుతో విషయం విజయవాడ పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. వీరిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దోపిడీ బృందం తాడేపల్లిలోని సీతానగర్‌లో గత నెల 22న అర్థరాత్రి ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి కత్తితో బెదిరించి బంగారపు ఆభరణాలను దోచుకున్నారు. ఆయన కూతురిపై కూడా అత్యాచారయత్నం చేయబోతుండగా ఆమె ప్రతిఘటించి కేకలు పెట్టటంతో వారు పరారయ్యారు. ఈ క్రమంలోనే వారు పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ