ఫోటో ఫీచర్ : మైక్రోసాప్ట్ తో తర్వాతి జనరేషన్!

December 29, 2015 | 11:21 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Microsoft-CEO-satya-nadella-babu-grandson-devansh-niharonline

ఇక్కడ ఉన్నవాళ్లలో ఒకరు టెక్నాలజీ రంగంలో కింగ్ అయితే, మరోకరు ఆ టెక్నాలజీని విపరీతంగా వాడుకునే వ్యక్తి వారసుడు. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల హైదరాబాద్ లోని చంద్రబాబునాయుడు ఇంటికి వచ్చిన వేళ, అక్కడే ఉన్న ఆయన మనవడు దేవాన్ష్ తో కాసేపు ఆడుకున్నాడు. బ్లూ కలర్ టీషర్టు, తెల్ల నిక్కర్, వైలెట్ కలర్ టోపీ వేసుకున్న దేవాన్ష్ సైతం, కొత్తవాడన్న బెరుకు ఏ మాత్రం లేకుండా సత్య నాదెళ్ల చంకెక్కేశాడు. ఆ సమయంలో సత్య సైతం ఆశ్చర్యపోగా, ఆ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దేవాన్ష్ ను కొద్ది సేపు ముద్దుచేసిన సత్య, కాసేపు అన్నీ మరచి సేదదీరారు. టెక్నాలజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి మంచి పేరుంది. అదే టెక్నాలజీని వాడుకుని ఆయన తనయుడు లోకేష్ కూడా దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పుడు మనవడు దేవాన్ష్ రంగంలోకి దిగేందుకు ఓ పదిహేనేళ్లయినా పట్టొచ్చు.   

                          ఇక నాదెళ్లతో భేటీ సందర్భంగా బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మీ మాతృభూమి రుణం తీర్చకునే సమయం వచ్చిందని చంద్రబాబు సత్య నాదెళ్లకు సూచించారు. తదుపరి వచ్చినప్పుడు స్వగ్రామాన్ని, అనంతపురం జిల్లాను సందర్శించాలని, రాష్ట్ర యువతను ఉద్దేశించి ప్రసంగించాలని కోరారు. దీనికి సత్య నాదెళ్ల సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ