శాడిస్ట్ ప్రేయసి ప్రియుడిపై యాసిడ్ పోసింది

October 16, 2015 | 04:46 PM | 1 Views
ప్రింట్ కామెంట్
girl-acid-attack-on-boy-in-guntur-niharonline

ఇన్నాళ్లు తమను ప్రేమించడం లేదనే అక్కసుతో, ప్రేమించినా తల్లిదండ్రులకు భయపడో, గౌరవించో వేరే వాళ్లతో  పెళ్లికి సిద్ధమైపోయారనే కోపంతో అమ్మాయిలపై అబ్బాయిలు దాడులు చెయ్యటం చూశాం. కత్తులతో నరకటాలు, గొంతులు కొయ్యటాలు, మరీ ముఖ్యంగా యాసిడ్ దాడులు చేస్తూ ఆనందించే శాడిస్ట్ లను చూశాం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ప్రియుడిపై ప్రియురాలే ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడింది.

ఆసక్తి కలిగించే ఈ ఘటన గుంటూరు లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పవన్ (పేరు మార్చాం) గత కొద్దికాలంగా  ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరు పెద్దలను ఎలాగైనా ఒప్పించి పెళ్లిచేసుకోవాలనుకున్నారు. కానీ ఆ యువకుడు ఆ యువతికి తెలీకుండా మరో అమ్మాయితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న మొదటి ప్రేయసి ఆగ్రహాంతో ఊగిపోయింది. యాసిడ్ తో అతనిపై దాడిచేసింది. ఈ ఘటనలో యువకుడి ముఖంతో పాటు శరీరంలోని పలు చోట్ల కాలిన గాయాలయ్యాయి. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అతనికి చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ ఘటనపై ఇంతవరకు కేసు నమోదు కాకపోవటం గమనార్హం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ