పదవ తరగతి ఫలితాల్లో బాలికలదే పై చేయి

May 20, 2015 | 05:31 PM | 37 Views
ప్రింట్ కామెంట్
ap_ssc_result_niharonline

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విశాఖలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు టెన్త్ క్లాస్ ఫలితాలను సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెగ్యులర్‌ విద్యార్థులు 66,06,575 మంది, ప్రైవేట్‌ విద్యార్థులు 38,386 మంది పరీక్షలు రాశారని తెలిపారు. మొత్తం 6,44,961 మంది విద్యార్థులు టెన్త్‌ పరీక్షలు రాశారని ఆయన అన్నారు. ఇందులో బాలురు 91.15 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలికలు 91.71 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కడప జిల్లా 98.54 శాతం ఉత్తీర్ణతో ప్రథమ స్థానంలో నిలిచింది. 71.2 శాతం ఉత్తీర్ణతతో సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు అట్టడుగున నిలిచింది. కడప, చిత్తూరు జిల్లాల మధ్య ఉత్తీర్ణత శాతం వ్యత్యాసం 27.30 శాతం ఉండటం గమనార్హం. 3645 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫలితాల శాతం పెరిగిందని మంత్రి గంటా అన్నారు. జూన్ 18 నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ