పామును పేకాడించిన పిల్లి

September 29, 2015 | 02:45 PM | 3 Views
ప్రింట్ కామెంట్
cat-snake-fight-in-srikakulam-niharonline

‘బుల్లెట్ చూడటానికి నాలా ఇంతే ఉంటుంది. దిగితే లోతు తెలుస్తుంది’... రేసుగుర్రంలో తన గురిచి అవమానంగా మాట్లాడిన విలన్ కి బ్రహ్మీ ఇచ్చే పంచ్ డైలాగ్ ఇది. నిజమే సైజుతో సంబంధం ఏముంటుంది చెప్పండి ఓడించడానికి, గట్స్ , ధీమాక్ ఉండాలి గానీ. సరిగ్గా ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంది. సుమారు ఐదడుగుల పొడవున్న నాగుపాము. దారితప్పి మనుషుల మధ్యకు వచ్చింది. దాన్ని చూసిన ప్రజలు భయం దూరంగా వెళ్లారు. కానీ, ఓ చిన్ని పిల్లి దాన్ని చూసింది. అంతే వెంటనే కలబడింది. పాము కాటు వేయాలని చూసిన ప్రతిసారీ ఒడుపుగా తప్పించుకుంటూ, తన పంజాతో కొడుతూనే వుంది. పామును ఓ బొమ్మ మాదిరి భావిస్తూ, అటూ ఇటూ నెడుతూ ఓ ఆట ఆడుకుంది. పిల్లి పంజా నుంచి తప్పించుకునేందుకు పారిపోతున్న పామును వెంబడించి మరీ ఫుట్ బాల్ ఆడుకుంది. కొన్ని నిమిషాల పాటు జరిగిన ఈ పోరును ఓ యువకుడు మొబైల్ లో సరదాగా చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడా పిల్లి సామాజిక మాధ్యమాల్లో సూపర్ హీరో అయిపోయింది. ఈ పోరును పలు టీవీ చానళ్లు కూడా ప్రసారం చేశాయి. అన్నట్లు ఇది జరిగిందో ఏదో వేరే దేశంలో కాదు మన శ్రీకాకుళం జిల్లాలోనే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ