బెజవాడ నడిరోడ్డుపై నోట్ల కట్టల సంచి

December 02, 2015 | 02:17 PM | 17 Views
ప్రింట్ కామెంట్
money-bag-dropped-on-vijayawada-road-niharonline

నవ్యాంధ్ర రాజకీయ రాజధాని విజయవాడలో నడిరోడ్డుపై నోట్ల కట్టల బ్యాగు కలకలం సృష్టించింది. బైక్ పై వెళుతున్న ఓ వ్యక్తి సదరు బ్యాగును పడేసి వెళ్లాడని తెలిసింది. మొఘల్రాజపురం సమీపంలోని భాష్యం స్కూల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్దిసేపటి క్రితం వెలుగుచూసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చనీయాంశమైంది. నడిరోడ్డుపై పడి ఉన్న ఆ బ్యాగును తెరచి చూసిన స్థానికులు అందులో ఉన్న నోట్ల కట్టలను చూసి నోరెళ్లబెట్టారు. సాదాసీదాగా కనిపిస్తున్న ఆ బ్యాగులో రూ.10 లక్షల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. డబ్బు కట్టలను ఆసక్తిగా పరిశీలించిన స్థానికులు ఆ తర్వాత వాటిని పోలీసులకు అప్పగించారు. అది దొంగ సొమ్మా లేక బ్లాక్ మనీ యా అన్నది తేలాల్సి ఉంది. డబ్బును పడేసిన ఆ వ్యక్తి ఎవరన్న విషయం మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం అతగాడి కోసం వెతికేపనిలో ఉన్నారు పోలీసులు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ