కడప కీలకనేత దారెటో?

December 22, 2014 | 10:39 AM | 37 Views
ప్రింట్ కామెంట్

తోటి నాయకులతో తన వ్యవహార శైలిపై ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ, కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నప్పటికీ జగన్ తీరు మార్పు కనిపించటంలేదు. ఇక ఇప్పుడు జగన్ పట్టించుకోకపోవటంతో పార్టీలో మరో కీలకనేత మైసూరారెడ్డి కూడా పార్టీని వీడుతారనే వార్తలు వినవస్తున్నాయి. రాజకీయంగా ఎంతో వైభవాన్ని కట్టబెట్టిన తెలుగుదేశం పార్టీని కాదని మైసురారెడ్డి ఎన్నికల ముందు వైఎస్సార్సీపీలో చేరారు. ఒకప్పుడు చంద్రబాబు నాయకత్వంలో రాజశేఖర్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన అదే రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ నాయకత్వంలో చంద్రబాబుపై విమర్శలు చేయాల్సి వచ్చింది. అయితే రాజ్యసభ సీటును ఆశగా చూపిన జగన్ ప్రస్తుతం ఆ సీటును విజయసాయిరెడ్డికి ఇవ్వాలని నిర్ణయించటంతో మైసూరా గుస్సాగా ఉన్నారట. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కడపకు చెందిన కీలక నేత కావటంతో ఆ జిల్లాలో పట్టుకోసం ఆయనను తిరిగి టీడీపీలోకి ఆహ్వనించవచ్చుననే అనుకుంటున్నప్పటికీ, టీడీపీ ని వీడిన తర్వాత ఆయన చేసిన విమర్శలు తీవ్రస్థాయిలో ఉండటంతో చంద్రబాబు ఆయన తిరిగి పార్టీలోకి చేర్చుకోవటం అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మధ్య కాంగ్రెస్ తోపాటు వైఎస్సార్సీపీ బడా నేతలంతా కమలం గూటికి చేరతున్నారు. దీంతో ఇప్పుడు ఈయన బీజేపీ గూటికి చేరతారని తెలుస్తోంది. మరి మైసూరా దారెటో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ