వినడానికి వింతగా ఉన్న ఇది నిజమండీ బాబూ. నెల్లూరు జిల్లా చుట్టి వాసులు ఇప్పటికీ గ్రామంలోకి ప్రవేశించే సమయంలో చెప్పులు కాళ్లకు కాకుండా చేతుల్లో కనిపిస్తాయి. ఏదో నిమ్న వర్గాల ప్రజలు ఇది పాటిస్తూన్నారంటే పొరపాటే, గ్రామంలోని అన్ని కులాలు, మతాల వారు ఈ ఆచారాన్ని పాటించాల్సిందే. కాదని ప్రవేశిస్తే ఏదో ఒక చెడు జరుగుతుందని వారు చెబుతున్నారు. ఏళ్ల తరబడి ఆ గ్రామంలో ఈ ఆచారం కొనసాగుతుందట. అసలు విషయమేంటంటే... గ్రామంలోకి ప్రవేశించాలంటే గ్రామ దేవత ఉన్న ఆలయాన్ని దాటుకుని వెళ్లాలి. అక్కడ చెప్పులు వేసుకుని నడిస్తే కీడు తప్పదని తమ పెద్దలు చెప్పారట. అందుకే అక్కడికి రాగానే చెప్పులు చేత బట్టి ఊళ్లోకి వస్తామని చెబుతున్నారు గ్రామస్థులు. అయినా వారు పెట్టుకున్న ఆచారాన్ని వారు నిష్ఠగా పాటిస్తున్నప్పుడు మధ్యలో మనకేంటిలేండి.