నెల్లూరు జిల్లా మహిమనూరులో కలకలం చోటుచేసుకుంది. గ్రామంలో శ్రీక్రుష్ణదేవరాయలు కాలం నాటి పురాతన చెన్నకేశవ ఆలయాన్ని తిరిగి నిర్మించాలన్న ఉద్ధేవంతో కూల్చివేతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గుడి ఎదురుగా ఉన్న చింత చెట్టు నుంచి పొగలు రావటం ప్రారంభమయ్యింది. దీన్ని చూసిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. ఆలయం కూల్చివేతతలో అరిష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్వామి ఆగ్రహం వల్లే చింతచెట్టు నుంచి పొగలు వస్తున్నాయని కొందరు భావిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రివేళ ఈ పొగలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. ఇక చుట్టుపక్కల ఉళ్ల జనాలైతే ఈ చెట్టును చూసేందుకు ఎగబడుతున్నారు. మరోపక్క శాస్త్రీయత కోసం కొందరు వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.