న్యూట్రిన్ కంపెనీ వింటే నోరూరే చాకెట్లు ఎన్నో గుర్తుకు వస్తాయి. వెరైటీ రకాల చాక్లెట్లతో దశాబ్దాల పాటు మధురానుభూతిని అందించిన ప్రముఖ సంస్థ ఇది. రంగు రంగుల ప్లేవర్లు, రకరకాల రుచులతో పిచ్చ క్రేజ్ ను సంపాదించుకుంది. 1952లో చిత్తూరులో ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచస్థాయి గుర్తింపును పొందింది. అంతర్జాతీయ స్థాయి సంస్థలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో, అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగింది. ఆశ, కోకనట్, ఎక్లేయిరిస్ ఇవన్నీ న్యూట్రిన్ ఉత్పత్తులే. వార్షిక టర్నోవర్ రూ. 1,500 కోట్లకు చేరుకుని సత్తాచాటిన న్యూట్రిన్, ఆ తర్వాత కాలంలో క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. పెరిగిన మార్కెట్ పోటీతోపాటు రోజుకో కొత్త రకం చాక్లెట్లు మార్కెట్లు రావటంతో ప్రస్తుతం అవసాన దశకు చేరుకుంది. ఇక ఇప్పుడు 'న్యూట్రిన్' చిత్తూరు ప్లాంట్ మూతపడబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీని ఎంత మాత్రం నడపలేపని యాజమాన్యం స్పష్టం చేసింది. కంపెనీ యాజమాన్యం అనేక సార్లు మారడం సంస్థను దిగజార్చింది. దీంతో, భారీ లాభాల్లో ఉన్న న్యూట్రిన్ నష్టాల్లోకి జారుకుని, చివరకు లాకౌట్ దశకు చేరుకుంది. ఒకప్పుడు ఈ సంస్థలో 3వేల మంది పనిచేసేవారు. కంపెనీ యాజమాన్యం నిర్ణయంతో కార్మికులంతా తమ ఉపాధిని కోల్పోనున్నారు. నాణ్యమైన, రుచికరమైన చాక్లెట్లను అందించిన న్యూట్రిన్, చివరకు లాకౌట్ దశకు చేరుకోవడం మనందరికీ బాధాకరమైన అంశమే.