పర్వీన్ ట్రావెల్స్ కు చెందిన ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. 38 మంది ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఈ ప్రమాద సమయంలో ప్రయాణికులను రక్షించింది ఓ ఫోన్ కాల్. అర్థరాత్రి కావటంతో ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్నారు. బస్సులో చివరి వరుసలో కూర్చోని ప్రయాణిస్తున్న శ్వేతా నటరాజన్ అనే యువతికి ఆ సమయంలో ఇంటి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. దీంతో మెలుకువ వచ్చిన ఆమె బస్సు వెనుక నుంచి పొగలు రావటం గమనించి, తోటి ప్రయాణికులను అప్రమత్తం చేసింది. దీంతో డ్రైవర్ బస్సు ఆపగానే మిగిలిన ప్రయాణికులంతా బస్సు దిగేశారు. వారు బస్సు దిగిన క్షణాల్లోనే బస్సు అగ్నికి బుగ్గైపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 లక్షల రూపాయల విలువైన వస్తువులు బూడిదైపోయాయి. ఏదేమైనా ఆ ఒక్క ఫోన్ కాల్ 38 మంది నిండు ప్రాణాలను కాపాడగలిగింది. లేకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో.