శోభనపు పెళ్లి కొడుక్కి షాకిచ్చిన పోలీసులు

February 20, 2016 | 05:01 PM | 5 Views
ప్రింట్ కామెంట్
AIDS-bridegroom-arrested-in-west-godavari-niharonline

ఫస్ట్ నైట్ కి సిద్ధమైపోయిన ఆ పెళ్లి కొడుక్కి ఊహించని పరిణామం ఎదురైంది. సాధారణంగా పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు తాళి కట్టబోతుండగా పెళ్లిని ఆపి అరెస్ట్ చేయటం మనం చూసిందే. కానీ, ఏకంగా శోభనపు గదిలోకి వెళ్లి ‘యూ ఆర్ అండర్ అరెస్ట్’ అంటే ఎలా ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 పెనుగొండ మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన సోమరాజు చాలా కాలంగా హెచ్ఐవీతో బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం అత‌డు గ‌ల్ఫ్ వెళ్లేందుకు టెస్టులు చేయించుకున్నాడు. దీంతో అత‌డికి హెచ్ఐవీ ఉంద‌ని తేలడంతో గ‌ల్ఫ్ వెళ్ల‌డం కుద‌ర్లేదు. అయితే త‌న‌కు హెచ్‌వీ ఉంద‌న్న విష‌యాన్ని దాచిపెట్టిన జ‌య‌రామ్‌ సోమరాజు చెరువు గ్రామానికి చెందిన ఓ యువతిని 16న వివాహం చేసుకున్నాడు. అంతేకాదు 18న పెద్దలు నిశ్చయించిన శోభనానికి సిద్ధమైపోయాడు.

ఇంతలో అసలు విషయం తెలుసుకున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు సకాలంలో స్పందించి సోమరాజును అదుపులోకి తీసుకుని, ఆమెకు అసలు విషయం వివరించారు. దీంతో కొత్తపెళ్లికూతురు, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కథ సుఖాంతం అయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ