ఈ సంత్సరం పుస్తెలమ్ముకోనక్కర్లేదు

August 20, 2015 | 02:47 PM | 6 Views
ప్రింట్ కామెంట్
no_rains_no_floods_no_pulasafish_this_year_niharonline

కోస్తా, ప్రత్యేకంగా తూర్పు, పశ్చిమ జిల్లా వాసులు భోజన ప్రియులు. కొంత మందికి చేపల కూరంటే ప్రాణం. సముద్రం, గోదారి, చెరువు, కాల్వల్లో రకరకాల ఫిష్ లు నోరూరిస్తుంటాయి. దేని రుచి దాందే. వీటన్నింట్లో పులస అనే చేప గురించి అక్కడి వాళ్లు పడిఛస్తారు. అలాగే రాజధానిలో మాయం మరాఠీల మనసు దోచుకునేందుకు ఈ వంటకాన్ని బహుమానంగా పంపుతుంటం రివాజు.

                                    సముద్రంలో జన్మ ఎత్తి తనమానాన్న యుక్త వయసు వచ్చే వరకు సముద్రంలోనే కాలక్షేపం చేస్తుంది. అప్పటి దాకా దానిపేరు ఇలస. ప్రకృతి ఆచారం ప్రకారం వర్షాలు పడతాయి. గోదారికి వర్షాలొచ్చి వరదలొస్తాయి. ప్రజాక్షేమం కాంక్షించి ఆనకట్టలకి గేట్లు ఎత్తేస్తారు. అప్పుడు ఈ ఇలసమ్మ ఎవరు చెప్పినా వినకుండా గోదారి ఎర్రనీరు చూసి ఉరుకులు పరుగుల మీద ఎదురీత్తూ గోదావర్లో దూకుతుంది. దూకీ దూగ్గానే పేరు మారిపోయి పులస అని పల్లెకారుతో ముద్దుముద్దుగా పిలిపించుకొంటుంది. ఇదంతా మున్నాళ్ల ముచ్చటే. గోదారి గట్టున లొట్టలేసుకుంటూ నాయుడుగారు రాజుగారూ, చౌదరిగారూ అభిప్రాయ బేధాలు మరిచి ఒకే మాట మీద నిలబడి నాయుడమ్మకి, రాణీగారికి, చౌదరమ్మకి హుకుం జారీ చేస్తారు. ఘాటైన మసాలాలతో రెడీగా ఉండమని, దీన్లో మళ్లీ పోతు పులుసు, చెన పులస అనే లింగ బేధం ఉంటుంది. చెన పులస అంటే నీళ్లోసుకుందన్న మాట. కడుపు నిండా చెన అంటే గుడ్లతో నిండుగా ఉండి ధర ఎంతయినా పలుకుతుంది. ఆ విధంగా దాని ఆయనువు మూడుతుంది. ఇంతా మజా అయిన చేప కాబట్టే పుస్తెలమ్మి అయినా పులస తినాలి అని గోదావరి శూద్రులు గొప్పలుపోతారు. అలాంటిది ఈ యేడూ వర్షాలు లేవు, వరదలు లేవు, పులసలు రావు...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ