పుణ్యం మేడీజీ... స్వామిజీస్!

July 31, 2015 | 04:01 PM | 3 Views
ప్రింట్ కామెంట్
pushkar_water_postal_department_niharonline

ఏదీ పుణ్యం? ఏదీ పాపం? ఎందరు పాపాత్ముల్లేకపోతే పుణ్యస్నానాలాచరించినోళ్లు కోట్లాది మందైతే కోట్ల రూపాయల ఆదాయం దేవుళ్లకి దక్కింది. క్షమించాలి పుణ్యత్ములు కూడా పాలుపంచుకున్నారుట!

రాజమండ్రి పుష్కరాల్లో గాడ్ జల్ పేరుతో గోదావరి స్వచ్ఛజలాల్ని తపాలాశాఖ వారి సహకారంతో పుణ్యపిపాసులకు  అందుబాటులో తెచ్చే ప్రయత్నం. బ్రహ్మాండంగా సక్సెస్సయి అలా ముందుకు పోయింది. ఈ గాడ్ జల్ అనే పేరే కొంచెం హితవుగా లేదు. గాడ్ జిల్లా అనే భయంకర మృగం పేరుతో సినిమా వచ్చింది కదా. ఇక ఈ దైవ జలం స్ఫూర్తితో గంగాజలాన్ని గంగోత్రి వద్ద సీసాల్లో నింపి దేశమంతటా ఇంటింటికి సరఫరా చేసేందుకు తపాలా శాఖ సన్నాహాలు చేస్తోంది. గంగాజల్ పేరుతో అజయ్ దేవగన్ హీరోగా ఒక సినిమా కూడా వచ్చింది. అందులో గంగాజల్ అంటే యాసిడ్ అనే ఉద్దేశం. ఏమైనా ఇటు గోదావరి మాత ను , అటు గంగమ్మను పోటా పోటీగా పుణ్యం పంచి పెట్టడానికి ఉరకలెత్తించడం శుభశూచకం. చిన్న ఇన్ఫర్మేషన్... ఆ మధ్య పోస్టల్ డిపార్ట్ మెంటు వారు హైదరాబాదు పిస్తా హౌజ్ వారి హలీంను కూడ ఎంకరేజ్ చేసియుంటిరి. పుణ్యభూమి కళ్లుతెరూ!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ