బూచి భయంతో బడికి తాళం పడింది

October 05, 2015 | 11:06 AM | 5 Views
ప్రింట్ కామెంట్
ghost-rumour-in-vizag-paderu-school-closed-niharonline

సాంకేతిక టెక్నాలజీని ఎలా పడితే అలా ఇష్టం వచ్చిన్నట్లు వాడుతున్న ఈ కాలంలో ఇంకా దెయ్యాలు, భూతాలు అంటూ నమ్మేవారు లేకపోలేదు. అయితే బడి ఎగ్గోటాలన్న విద్యార్థుల ప్లానో... లేక ఎవరన్నా ఆకతాయిలు చేస్తున్న చేష్టలో తెలీదుగానీ ప్రస్తుతం ఆ ఊళ్లో ప్రజలు గజగజలాడిపోతున్నారు. విద్యార్థులైతే ఏకంగా అక్కడ దెయ్యం ఉందంటూ స్కూల్ కి వెళ్లటమే మానేశారు. విశాఖపట్టణం జిల్లా పాడేరు మండలంలోని ఓబర్తిలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొంది. దీంతో బడికి తాళం పడింది. పదిహేను రోజుల క్రితం విద్యార్థులతో కళకళలాడిన ఈ పాఠశాల నేడు బోసిపోయింది. దెయ్యం లేదు గియ్యము లేదంటూ టీచర్లు ఎంతగా నచ్చజెప్పినా విద్యార్థులు వినటం లేదు.

                          కొన్ని రోజుల క్రితం గ్రామానికి చెందిన భీములమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. గ్రామంలోని శ్మశానంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, పాఠశాలకు, శ్మశానానికి వెళ్లే మార్గం ఒకటే. దీంతో విద్యార్థులు ఆ మార్గం గుండా వెళ్లాలంటే భయంగా ఉందని, తమపై భీములమ్మ రాళ్లు రువ్వుతోందంటూ విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. దెయ్యంగా మారిని భీములమ్మ గ్రామంలోని ఒక ఇంట్లో ఉందంటూ గ్రామస్తులు ఆ ఇంటిని కూడా తగులబెట్టడం విశేషం! పిల్లల గగ్గోలుతో పెద్దలు కూడా బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇక జనవిజ్నాన వేదిక వాళ్లు కలగజేసుకోవటమే తరువాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ