కృపామణి సూసైడ్ కేసులో మరిన్ని నగ్నసత్యాలు

October 27, 2015 | 12:03 PM | 5 Views
ప్రింట్ కామెంట్
shocking-facts-in-krupamani-suicide-case-in-AP-niharonline

ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన కృపామణి ఆత్మహత్య ఉదంతం తెలిసిందే. చనిపోయే ముందు ఆమె తీసుకున్న వీడియో ఒకటి బయటికి రావటంతో ఆమె సూసైడ్ లో ఘోరాలు వెలుగు చూశాయి. చిన్న గొడవ కావటంతో భర్తకు దూరమై ఆదరణ కోసం పుట్టింటికి చేరింది. అయితే కన్నవారు, సోదరుడు, ఓ రౌడీ షీటర్ తనతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని, వారి వేధింపులు తాళలేకే చనిపోతున్నానని ఆమె వీడియోలో పేర్కొంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో జరిగిన ఈ ఉదంతంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్వయంగా స్పందించారు. దీంతో ఆయన ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసు బాసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

కృపామణిపై వేధింపులకు పాల్పడ్డ రౌడీ షీటర్ శ్రీనివాస్ ఇంటిని నిన్న పోలీసులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఇంటిలో లభించిన ఓ పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని చూసి పోలీసులే నివ్వెరపోయారట. సదరు చిన్నపాటి పెన్ డ్రైవ్ లో వందలాది నగ్న వీడియోలతో పాటు న్యూడ్ ఫొటోలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయట. అంటే, ఒక్క కృపామణిపైనే కాక పెద్ద సంఖ్యలో మహిళలను శ్రీనివాస్ వేధించినట్లు పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లైంది.

అంతేకాదు శ్రీనివాస్ తో కృపామణి తల్లి జరిపిన సంభాషణలకు సంబంధించి ఆడియో సాక్షాలు కూడా పోలీసుల చేతికి చిక్కాయట. ఇదిలా ఉంటే ఇప్పటికీ శ్రీనివాస్ గాని, కృపామణి తల్లిదండ్రుల ఆచూకీ గాని లభ్యం కాలేదు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శ్రీనివాస్ కొనసాగించిన కీచక పర్వంపై బాధిత మహిళలు ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని పోలీసులు కోరుతున్నారు. తద్వారా ఆ రాక్షసుడికి మరింత కఠిన శిక్షలు పడేలా చెయ్యొచ్చని వారు చెబుతున్నారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ