పందెం కోడి నెగ్గింది

January 12, 2015 | 04:02 PM | 36 Views
ప్రింట్ కామెంట్

కోడి పందేలను నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలు సంక్రాంతి పండుగ ఉత్సవాన్ని జోరుగా చేసుకోవచ్చు. కోడి పందేలాకు కోర్టు అడ్డు తొలగడంతో పందెం కోళ్ళకు గిరాకీ మరింత పెరిగిపోయింది. అయితే కోర్టు ఈ కేసును విచారించే వరకూ యథాస్థితి కొనసాగుతుందని తీర్పు చెప్పింది. కొద్ది రోజులుగా ఈ విషయమై కోడిపందేల ఆటగాళ్ళలో నిరుత్సాహం చోటు చేసుకుంది. సుప్రీం కోర్టు నిర్ణయంతో గోదావరి జిల్లా ప్రజల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఈ కేసు మాట ఎలా ఉన్నా కోళ్ళ పందేలు ఆపేది లేదని కొందరు భీష్మించుకు కూర్చున్నారు. ఇది ఎన్నాళ్ళుగానో నడుస్తున్న సంప్రదాయమనీ, దీన్ని అడ్డుకునే వారెవరని ప్రశ్నించే వారూ ఉన్నారు. అయితే తమిళనాడులోని జల్లికట్టు ఉదంతం ద్రుష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇక ఆంధ్ర ప్రజలు కోడి పందేలకు సై అంటే సై అంటున్నారిప్పుడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ