కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పొగడ్తలతో ముంచెత్తారు. ఆమె యంగ్, డైనమిక్, డెడికేటేడ్, కారెక్టర్, క్యాలిబర్, కెపాసిటేడ్, డిసిప్లిన్, డైనమిజమ్, డివోషన్... అంటూ ఆమె సమర్థలను ఓ రేంజ్ లో పొగిడారు. ఓర్పుతో... మార్పుతో... చేర్పుతో... ఆమె ఎంతో హుందాగా వ్యవహరిస్తారని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కు రావాలని కోరగానే ఆమె అంగీకరించారని, అందుకు ఆమెకు ధన్యవాదాలని తెలిపారు. వెంకయ్య మాట్లాడిన వేగానికి ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలియక సభపై ఉన్న పెద్దలు ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్నారు. స్మృతి ఇరానీ ఏకంగా ఆయన మాటలకు అర్థం చెప్పాలని పక్కనున్న వారిని కోరారట. వెంకయ్య వాగ్ధాటా... మజాకానా!