మతానుసారంగా ఏదో సాకుతో గుంపులు గుంపులుగా, మందలు మందలుగా ఒకచోట చేరి అనర్థాలు కాని తెచ్చుకోవడంలో ఏ మాత్రం కూడా మినహాయింపు కాదు. అంతా దైవమే చూసుకుంటారనే ధీమాతో క్రౌడ్ మేనేజ్ మెంట్ ను అశ్రద్ధ చేసి పీకల మీదకు తెచ్చుకుంటే ఏమవుతుంది. రాజమహేంద్రంలా అవుతుంది. తొమ్మిది అంకె శుభశూచకమట. పరలోక ప్రాప్తిరస్తు అనుకున్న వారి సంఖ్య కూడ ఇరవైఏడు. వెరసి టోల్ తొమ్మిది. పైగా మనది కర్మభూమి. కర్ణుడి చావుకి ఎన్ని ఉన్నాయో పుష్కర మరణాలకి అన్ని కారణాలు ఉన్నాయి. అన్యాయంగా అభాగ్యుల ముందు చూపులేక బలయిపోవటం మాత్రం దారుణం.
ధవళేశ్వరం నుంచి కోటిలింగాల ప్రాంతం నుంచి, కొవ్వూరు నుంచి పుష్కర ఘాటుకే వచ్చి కొరివితో తలగోక్కోవడం చాలా దయనీయ పరిస్థితి. నిజంగా అమాయకత్వం, అజ్నానం, ప్రాణఆలు ముఖ్యమా కాదా? దైవం కంటే జీవం ముఖ్యం. దొంతర దొంతర్లగా మానవ సమూహం ఒకేచోట చేరితే, పుణ్యం మాట దేవుడెరుగు, కాలుష్యం సంగతేమి? రోదగ్రస్త వాతావరణం తప్పదుగా! గతంలో గవర్నరు ఖాందూ భాయ్ దేశాయ్ ఈ పవిత్ర రాజమండ్రి నగరాన్ని సందర్శించి పబ్లిక్ టాయ్ టెట్టు అని కితాబిచ్చి వెళ్లారు. హైదరాబాదు కూడ నాయకుల భక్తి పారవశ్యపు అఘాయిత్యాలకి మినహాయింపుకాదు. సోమవారం లిబర్టీ సెంటర్ లో ఉన్న వెంకన్న దేవాళయం, మంగళవారం ఖైరతాబాదు అంజయ్య ఆలయం కేంద్రంగా ట్రాఫిక్ జాం అయి సామాన్య జనానికి ఎదురయ్యే అగచాట్లు... ఎవరి చలవో తెలుసుకదా. రాష్ట్ర ప్రథమ పౌర నరరూపసింహలు వారిదే మరి! నాస్తికులు నాయకులయినా, నాయకులే నాస్తికులయినా బడుగుజీవులు బతికి బట్టకట్టగలరు దేవుడా!