తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ విమర్శల వర్షం కుప్పించాడు. కేసీఆర్ మరో ‘హిట్లర్’ లా వ్యవహరిస్తున్నాడంటూ ట్విట్టర్ వేదికగా చేసుకుని విరుచుకుపడ్డాడు. టీఆర్ఎస్ నేతలు గుండాలా వ్యవహరిస్తు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అసలు రౌడీలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రపంచ ఎకనమిక్ ఫోరంలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ప్రమోట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన సహచర వర్గం మాత్రం విద్వేషాలను ప్రమోట్ చేస్తున్నారంటూ పేర్కొన్నాడు.