త్వరలో హైదరాబాద్ లో ఏర్పాటు కాబోయే ఐటీఐఆర్ కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. సుమారు 6 నుంచి 10 వేల కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు శుక్రవారం ఆయన అసెంబ్లీలో ప్రసంగించారు. అంతేగాక పలువురు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ లో పెట్టుబడులకు ముందుకు వచ్చేందకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విప్రో నుంచి 5వేల ఉద్యోగాలు ఇస్తామని అజీమ్ ప్రేమ్ జీ హామీ ఇచ్చారని తెలిపారు. ఆదిభట్లలో ఏర్పాటుచేసే టీసీఎస్ కంపెనీ ద్వారా 27వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ప్రభుత్వం తరపు నుంచి సుమారు లక్ష ఉద్యోగాలు కోసం నొటిఫికేషన్లు జారీచేయాల్సి ఉందని, అయితే కమల్ నాథన్ కమిటీ నివేదిక దీనికి అడ్డంకిగా మారిందని వివరించారు. త్వరలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.