గులాబీ దళంలో లుకలుకలు

December 20, 2014 | 12:40 PM | 87 Views
ప్రింట్ కామెంట్

అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మొదలయినట్టు తెలుస్తోంది. దుబాయ్ పర్యటన ముగించుకుని వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ కీలక నేత, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ బొత్తిగా కనిపించడమే లేదు. పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా ఖచ్చితంగా కనిపించే వ్యక్తి కేటీఆర్. అలాంటిది, మంత్రి వర్గ విస్తరణ సమయంలో కాని, అనంతరం జరిగిన కేబినెట్ సమావేశాలకు కానీ, చివరకు కరీంనగర్ జిల్లాకే చెందిన కొప్పుల ఈశ్వర్ చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికి కానీ కేటీఆర్ హాజరు కాలేదు. దీంతో, పార్టీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందని, లుకలుకలు ప్రారంభమయినట్టున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మంత్రి పదవి దక్కని వరంగల్ కీలకనేత కొండా సురేఖ కూడా పార్టీని వీడబోతున్నారనే వార్త పార్టీలో కలకలం రేపుతోంది. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన ఆమె ఈ విషయంలో చాలా అసంత్రుప్తితో ఉన్నారని, అయితే ఆమె భర్త కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినప్పటకీ ఆమె కాస్తా బెట్టుచేస్తున్నారని సమాచారం. ఈ అంశంపై తాడో పేడో తేల్చుకున్నాకే పార్టీలో కొనసాగాలా వద్దా అన్నది నిర్ణయించుకుంటుందని సురేఖ సన్నిహితులు చెబుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ