ఇటుకకు రాయి సమాధానం కాదు రామా

November 12, 2014 | 12:09 PM | 885 Views
ప్రింట్ కామెంట్

విపక్షాల విసుర్లకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. కొన్ని కొన్నిసార్లు ఈ వివరణ విమర్శలకు దారితీయడం పరిపాటే. కానీ అది అసందర్భోచితంగా ఉంటే.. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి ఘటన తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చోటుచేసుకుంది. మండలి సభ్యుడు కే.నాగేశ్వర్ రావు సభలో మాట్లాడుతూ పాఠ్యాంశ పుస్తకాలలో నిజాం చరిత్రను పొగుడుతూ విద్యార్థులకు బోధిస్తూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని తక్కువ చేసి అవమానపర్చోదంటూ ప్రభుత్వాన్ని కోరారు. దీనికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందిస్తూ తక్కువ చేసేలా తాము వ్యవహారించడం లేదని, అనవసరమైన విమర్శలు చేయోద్దని గట్టిగానే బదులిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మైక్ కట్ చేస్తే ఈ తతంగంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈ విషయమై స్పందిస్తూ నాగేశ్వర్ రావు గారంటే అభిమానం ఉందని అంటూనే ఇటుకతో కొడితే రాయితో కొట్టినట్లు సమాధానం ఇవ్వాల్సి వస్తుందని ఘాటుగా స్పందించారు. నాగేశ్వర్ రావు లాంటి విశ్లేషకులు సభ సభ్యుడిగా విమర్శించినప్పుడు దానికి తగినట్లు సమాధానం ఇవ్వాలే గానీ, ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడం తగునా తారకరామా?.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ

SELECT articles.alias as alias,categories.alias as cat_alias, sub_category.alias as sub_alias, articles.img as img, articles.title as title FROM articles join categories on articles.cate_id=categories.id join sub_category on articles.sub_cate_id=sub_category.id WHERE articles.id = (SELECT MAX(a.id) FROM articles as a WHERE a.id >= "32" AND a.cate_id =3 AND a.sub_cate_id =8)