బచ్చన్ కి ఏఎన్నార్ పురస్కారం

December 20, 2014 | 01:15 PM | 289 Views
ప్రింట్ కామెంట్

ప్రముఖ నటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు-2014 పురస్కారానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ఎంపికయ్యారు. ఈ నెల 27న అవార్డును బిగ్ బీకి ప్రదానం చేయనున్నట్టు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. నటసామ్రాట్ నాగేశ్వర్ రావు నటించిన ఆఖరి సినిమా మనం లో అమితాబ్ బచ్చన్ ఓ గెస్ట్ రోలులో అలరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డుకు ఎంపిక కావటం పట్ల అమితాబ్ ఆనందం వ్యక్తంచేశాడు. ఒక గొప్ప నటుడి పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డు తనకు రావటం సంతోషంగా ఉందని ట్విట్టర్లో బిగ్ బీ పేరుకున్నాడు. మరోవైపు మనం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు బచ్చన్ కుటుంబం ఆసక్తితో ఉందని తెలుస్తోంది. అల్రెడీ ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను అమితాబ్ కొనుగోలు చేశాడని ఓ టాక్ కూడా వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ