ముకుందకు U/A సర్టిఫికెట్

December 20, 2014 | 01:03 PM | 326 Views
ప్రింట్ కామెంట్

మెగా ఫామిలీ అందగాడు వరుణ్ సినిమా ముకుంద రిలీజ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. దీనికి U/A సర్టిఫికేట్ లభించింది. దీంతో ముందు అనుకున్నట్టుగా ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసేస్తున్నారు. వరుణ్ తేజ్ తొలి సినిమాగా ‘ముకుంద’పై మెగా అభిమానులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిక్కి జె మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న చిత్రం ఇదే కావడంతో దీనికి మంచి క్రేజ్ వచ్చింది. అలాగే, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా కావడంతో ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని అనుకుంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ