అంతా ’మేముసైతం‘ అన్నా ఇంతేనా?

December 06, 2014 | 03:08 PM | 334 Views
ప్రింట్ కామెంట్

ఎప్పుడూ సంచలన స్టేట్ మెంట్లు ఇచ్చే నిర్మాత, దర్శకుడు అయిన తమ్మారెడ్డి భరద్వాజ మరో స్టేట్ మెంటుతో సినీ హీరోలకు షాక్ ఇచ్చాడు. తెలుగు చిత్ర పరిశ్రమ హుదూద్ బాధితుల కోసం నిర్వహించిన 'మేము సైతం' పై ఆయన నిరాశ వ్యక్త పరిచారు. చిత్తూరులో గాయకుడు బాలసుబ్రమణ్యం ఒక్కరే గంటసేపు ఓ కార్యక్రమం చేస్తే, దానికి రూ.కోటి వచ్చిందని, ఇప్పుడు పరిశ్రమ అంతా కలిసి 'మేము సైతం' నిర్వహిస్తే అది కూడా 12 గంటల పాటు ఏకధాటిగా ఎంటర్ టైన్ చేసినా 8 కోట్లు కూడా రాలేదని ఆయన వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల వేడుకలకు నటీనటులందరూ రావడం లేదని అదే ఫిలింపేర్ అవార్డులకు మాత్రం పరిగెత్తుకు వెళుతున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టిస్టులంతా కలిసి తుఫాను బాధితుల సహాయార్థం చేపట్టిన 'మేము సైతం' కార్యక్రమానికి హీరోలంతా స్వచ్ఛందంగా రావాల్సి ఉండగా, ఒక్కొక్కరినీ బతిమిలాడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హీరోలకు దమ్ముల్లేవని ఇదే విధమైన సంచలన వ్యాఖ్యలు గతంలో కూడా చేశారాయన.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ