పర్సనల్స్ చెప్పేస్తుందట

December 06, 2014 | 03:05 PM | 472 Views
ప్రింట్ కామెంట్

ఇన్నాళ్లూ పవన్ నిల్చున్నా, కూర్చున్నా తెగ పొగిడేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన రేణు దేశాయ్, ఇప్పుడో కొత్త విషయం బయట పెట్టింది. ఇదేదో సస్పెన్స్ మూవీలా తన పుట్టిన రోజున తన పర్సనల్స్ చెప్పేసుకుంటానంటోంది. అదేమిటోనని సినిమా అభిమానులు, ముఖ్యంగా పవన్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఎవరే ప్రశ్నలు వేసినా పర్సనల్ మాటర్స్ అడగవద్దంటూ ముందుగానే చెప్పేస్తూ వచ్చిన రేణు ఇప్పుడీ కొత్త ముచ్చటలేమిటో ఎవరూ ఊహించలేకపోతున్నారు. తన పర్సనల్ విషయాలను తన పుట్టిన రోజయిన డిసెంబర్ 4న యూ ట్యూబ్ లో వీడియో విడుదల చేస్తుందట. అందరూ వీరు విడిపోవడానికి గల కారణాలను చెపుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. మరి ఈమె అలాంటి పర్సనల్ విషయాలు చెపుతుందా లేక వారి వారి ఇష్టాయిష్టాలేమిటో చెపుతుందా? ఎదురు చూడాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ