హిట్ అండ్ రన్ కేసునుంచి ఉపశమనం పొందిన సల్మాన్ ఖాన్ కు జోథ్ పూర్ కోర్టు మళ్ళీ షాకిచ్చింది. పదహారేళ్ల కిందట సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు లో సల్మాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ను తిరస్కరించింది. సాక్షులను మళ్లీ విచారించేందుకు అనుమతించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్ ను న్యాయస్థానం అంగీకరించలేదు. అక్టోబర్ 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడి నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్మాన్ ఖాన్ పై కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలుసు. సినిమాల్లో పైపైకి ఎదుగుతున్న సల్మాన్ కు లైఫ్ విషయంలో మాత్రం ప్రశాంతత కరువైనట్టు ఈ కేసులను బట్టి తెలుస్తోంది.