నటి జ్యోతికతో '36 వయనిదిలే' అనే సినిమా తీయడం అది కూడా భర్త సూర్య నిర్మాణకత్వంలో రావడం అభినందించదగినది. ఈ సినిమా బావుందనే టాక్ రావడంపై ఈ ఇరువురూ చాలా ఆనందంగా ఉన్నారు. నేటి పురుషాధిక్య సమాజంలో మహిళలు రోజువారీ జీవితంలో మరింత కాన్ఫిడెంట్ గా ఉండడానికి తన పాత్ర ఉపయోగపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు జ్యోతిక. తమ వ్యక్తిగత జీవితాన్ని, కలల్ని త్యాగం చేస్తున్న గృహిణులకు సమాజంలో గుర్తింపు కావాలని జ్యోతిక అన్నారు. మేల్ డామినేషనేటెడ్ సినీ పరిశ్రమలో హీరోయిన్లు తమ స్టాండ్ ఏంటో తెలుసుకోవాలనే ఈ సినిమా చేశానన్నారు. పెళ్లైనంత మాత్రాన హీరోయిన్లు విశ్వాసాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదనీ, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ, విశ్వాసంతో ముందుకు వెళ్లాలనే విషయాన్ని కథానాయికలు అర్థం చేసుకోవాలని జ్యోతిక అన్నారు. ప్రముఖ తమిళ నటుడు సూర్యతో పెళ్లి, పిల్లలు తర్వాత సుమారు ఎనిమిదేళ్ళ తర్వాత వెండితెరపై '36 వయనిదిలే' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా నడుస్తోంది. మలయాళంలో ఘన విజయం సాధించిన 'హౌ ఓల్డ్ ఆర్ యు' చిత్రానికి తమిళ రీమేక్ ఈ '36 ఏళ్ళ వయసులో' చిత్రంలో జ్యోతిక భర్తగా నటుడు రెహమాన్ నటించారు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంఓ 2డి ఎంటర్‑టైన్‑మెంట్ పతాకంపై సూర్య ఈ సినిమాను నిర్మించారు.